Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ...రంగుల కేళీ: చిట్కాలు

Gulzar Ghouse
ప్రతి ఒక్కరూ రంగుల కేళీ...హోలీ పండుగ కోసం నిరీక్షిస్తుంటారు. హోలీ పండుగలో అన్నిరకాల రంగుల సమ్మేళనం కలిసివుంటుంది. ముఖ్యంగా అందంగా, తెల్లగావుండేవారికైతే మరీ ఆందోళనగావుంటుంది. ఎందుకంటే రంగు వారిపై పడితే, అది అంత త్వరగా పోదనేది వారి అనుమానం. అంతే కాకుండా వారి చర్మంపై దుష్ప్రభావం పడుతుందనేదికూడా మరో అనుమానం.

హోలీ పండుగను జరుపుకోవడానికి ఉత్సాహం ఉరకలు వేస్తున్నాకూడా ఆ రంగులు వారి చర్మంపై దుష్ఫలితాలనిస్తుందన్న ఆందోళనతో అసలు ఈ పండుగను జరుపుకోవడానికి సంకోచిస్తున్నారు. అలాంటి వారికి కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు ఉపయోగిస్తే రంగులను త్వరగా శరీరంపైనుంచి తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

** ఓ పాత్రలో నిమ్మకాయ రసం, పాలు కలిపి పేస్ట్‌లా చేసుకుని దానిని శరీరానికి పూయండి. ఈ పేస్టును దాదాపు 15-20నిమిషాలవరకు అలానే ఉంచుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం, కాళ్ళు-చేతులు కడుక్కోండి. రంగులు మటుమాయం.

** కీరకాయ రసాన్నితీసి అందులో రోజ్ వాటర్‌ కలిపి శరీరంపై పూసుకోండి. దీంతో మీ శరీరంపై అంటుకున్న రంగులను సునాయాసంగా తొలగించుకోవచ్చు.

** ముల్లంగి రసంలో పాలు లేదా మైదా కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోండి. దీంతో మీ ముఖానికి అంటుకున్న రంగులు మటుమాయం.

** మరీ ఎక్కువగా రంగులు మీ శరీరానికి అంటుకునివుంటే రెండు చెంచాల జింక్ ఆక్సైడ్, రెండు చెంచాల క్యాస్టర్ ఆయిల్‌ను కలిపి శరీరానికి, ముఖానికి పూయండి. ఆ తర్వాత స్పాంజ్‌తో తుడిచి ముఖం కడుగుకోండి. 20-25 నిమిషాల తర్వాత సబ్బుతో కడుగుకోండి. మీ శరీరంపైనున్న రంగులు మటుమాయమౌతుందని నిపుణులు పేర్కొన్నారు.

** పాలలో కాస్త పచ్చి బొప్పాయను వేసి రుబ్బండి. దీంతోబాటు కాస్త ముల్తానీ మట్టిని అలాగే బాదంనూనెను కలిపి పేస్ట్‌లా చేసుకుని శరీరంపై రాయండి. అరగంట తర్వాత స్నాన‌ం చేయండి. రంగులు సునాయాసంగా తొలగిపోతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments