Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హోలీ రంగులు శరీరంపై నుంచి తొలగించుకోవడం ఎలా?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (20:38 IST)
హోలీ పండుగ ఈ నెల 9వ తేదీ రాబోతోంది. పండుగ నాడు వివిధ రంగులు తమ శరీర చర్మానికి హాని కలుగుతాయని చాలామంది వాటి జోలికి వెళ్ళరు. ఆ పండుగ వచ్చిందంటే కొందరు అమ్మాయిలు అబ్బాయిలు బయటకు రావాలంటేనే భయపడుతుంటారు. 
 
హోలీ రంగులతో చర్మసౌందర్యం పాడైపోతుందని భయపడుతుంటారు. ఇలాంటి వారు భయపడాల్సిన పనిలేదు. శరీరంపై పడ్డ విభిన్న రంగులను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉపయోగిస్తే ఇంటిల్లిపాది హోలీ రంగులతో ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు, మీరు కూడా మీ స్నేహితులకు రంగులను చల్లి హోలీ పండుగను జరుపుకోవచ్చు. 
 
1. ముల్లంగి రసంలో పాలు, బేసన్ లేదా మైదా పిండిని కలుపుకుని పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రుద్దుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని, చేతులు, కాళ్ళను శుభ్రం చేసుకోండి. 
 
2. ఒకవేళ మీ శరీర చర్మానికి ఎక్కువ రంగులు అంటుకుపోతే రెండు చెంచాల జింక్ ఆక్సైడ్, రెండు చెంచాల క్యాస్టర్ ఆయిల్ కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి, శరీరంలోని ఏయే ప్రాంతాలలో రంగులు అధికంగా ఉండాయో ఆయా ప్రాంతాలలో పూయండి. తర్వాత స్పాంజ్‌తో శరీర చర్మాన్ని తుడవండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత  సబ్బుతో స్నానం చేయండి. మీ చర్మంపైనున్న రంగులు మటుమాయమౌతాయి. 
 
3. జొన్న పిండి, బాదం నూనెను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై పూయండి. దీంతో చర్మంపైనున్న రంగును సునాయాసంగా తొలగించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

తర్వాతి కథనం
Show comments