తిరుమల చేరుతున్న భక్త జనసందోహం

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (14:28 IST)
వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దైవం కొలువున్న వేంకటనాథుని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే నిజంగానే వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని హిందువులు నమ్ముతారు. ఆ నమ్మకం ఎంతో బలమైనది. రాకెట్ వేగంతో మానవుడు ముందుకు దూసుకుపోతున్నా.. ఆ రాకెట్ ను ప్రయోగాన్ని విజయవంతం చేయమని వెంకన్న స్వామిని కోరుకునేంత నమ్మకం. 
 
అందుకే పండితులు, పామరులు అనే తేడా లేకుండా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల కిటకిటలాడుతుంది. పైగా ఏడాది ఆరంభం కూడా కావడంతో జనం తిరుమల బాట పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు ఇలా ఒకరేంటి ప్రభుత్వ సారధలందరూ తిరుమలకు క్యూ కడుతున్నారు. 
 
వీరి సంగతి ఇలా ఉంటే ఇప్పటికే సామాన్య భక్తులు తిరుమల చేరుకుని క్యూ కాంపెక్సులోకి చేరేందుకు సన్నద్దమయిపోయారు. వారిని మధ్యాహ్నాం 12 గంటల నుంచి లోని అనుమతించడంతో టిబిసి ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. ద్వారాల వద్ద తొపులాటలు జరుగుతున్నాయి. రోడ్లపై జనమే జనం కనిపిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు క్యూలైన్లోకి అడుగిడితే వీరికి గురువారం ఉదయం 5 గంటల నుంచి దర్శన భాగ్యం లభిస్తుంది. 
 
వాస్తవానికి 1.45 గంటల నుంచే దర్శనం ఉన్నప్పటికీ ఆ సమయమంతా కైంకర్యాలకు, విఐపీలకు సరిపోతుంది. తరువాత సామాన్య భక్తులకు సాయంత్రం వరకూ దర్శన భాగ్యం కలుగుతుంది. ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం ఉండడంతో రోజుల తరబడి అయినా సరే క్యూలైన్లలో వేచి ఉండడానికి భక్తులు సిద్ధపడిపోయారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments