మే 11 నుంచి శుభప్రదం

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (21:12 IST)
పాఠశాల విద్యార్థుల కోసం ప్రతీ యేడు ఏర్పాటు చేసే శుభప్రదం కార్యక్రమాన్ని మే 11 నుంచి పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. బుధవారం తిరుపతిలో ఆయన శుభప్రదానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. వారి కోసం మే 11 నుంచి 20 వరకూ వేసవి సెలవులలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపైన రెండు రాష్ట్రాలలో తగిన ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 
 
ధార్మిక కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వారిలో ఏడు మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి రఘునాథ తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిప్రసాద్ రెడ్డి అందుకే వచ్చారు, 5 ఏళ్ల క్రితమే విడాకులకు అప్లై చేసా: సర్పంచ్ గణపతి భార్య వీడియో

కేఏడీఏ భాగస్వామ్యంతో కుప్పంలో యువతకు శిక్షణా కేంద్రంను ఏర్పాటుచేసిన హిందాల్కో

Ambati Rambabu: అంబటి రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలి

చిన్నారుల మెదళ్లను తొలిచేస్తున్న సోషల్ మీడియా : మాజీ సీఈవో అమితాబ్

అజిత్ పవార్‌ సతీమణికి పదవి - మహారాష్ట్రకు తొలి డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Show comments