అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి?

అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. అక్షయ తృతీయ పండుగనాడు తప్పకుండా బంగారు, వెండి నగలను కొనాలంటూ ప్రచారం జరగడంతో చాలామంది అప్పు చేసైనా బంగారం కొనాలని ఎగబడుతుంటారు. ఐతే ఇలా బంగారు,

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (11:58 IST)
అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. అక్షయ తృతీయ పండుగనాడు తప్పకుండా బంగారు, వెండి నగలను కొనాలంటూ ప్రచారం జరగడంతో చాలామంది అప్పు చేసైనా బంగారం కొనాలని ఎగబడుతుంటారు. ఐతే ఇలా బంగారు, వెండి వస్తువులు కొనడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదంటున్నారు కొంతమంది జ్యోతిష నిపుణులు.
 
దీనికి ఓ కథను ఉదహరిస్తూ... ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం, హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుందని చెపుతాడు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరమును శుభ్రపరచి, దేవుని పటాలకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. 
 
ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి. పూజామందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి. అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపులో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. 
 
కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. అక్షయ తృతీయ నాడు ఏప్రిల్ 29న చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. దానం చేయమని పురాణాలు చెపుతుండగా కొత్తగా బంగారం, వెండి కొనాలంటూ ప్రచారం రావడం విచిత్రమంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments