తిరుమల గిరులకు పోటెత్తిన భక్తజనం

Webdunia
శనివారం, 23 మే 2015 (08:26 IST)
పదో తరగతి, ఎంసెట్‌ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకు క్యూకట్టారు. శనివారం ఉదయం కూడా కొండ కిటకిటలాడింది. దీనికి వారాంతపు రద్దీ తోడవడంతో తిరుమలంతా జనమే జనం. దీంతో సర్వదర్శనానికి 20 , దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్యదర్శన క్యూలైన్లు క్యూకాంప్లెక్సులు నిండి నారాయణగిరి ఉద్యానవనంలోకి కిలోమీటర్‌కు పైగా వ్యాపించాయి. 
 
మహాలఘు దర్శనం నిరంతరాయంగా కొనసాగుతున్నా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఆలయం ముందు, నాలుగుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ వితరణశాల, నిత్యాన్న సముదాయం, కల్యాణకట్ట భక్తులతో కిక్కిరిశాయి. వచ్చిన వారికి వచ్చినట్లు కేటాయిస్తుండడంతో గదులన్నీ సాయంత్రానికే నిండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Show comments