పుష్కరాలు ప్రారంభం... చంద్రబాబు అధికారక స్నానం

Webdunia
మంగళవారం, 14 జులై 2015 (06:48 IST)
పన్నెండు వసంతాలకోసారి వచ్చే పుష్కర పుణ్యాన్ని దక్కించుకొనేందుకు దేశం నలుమూలల నుంచి గోదారి తీరానికి భక్త జనం పోటెత్తుతున్నారు. మంగళవారం ఉదయం సరిగ్గా 6.26గంటలకు గురుడు సింహరాశిలోకి ప్రవేశించే ముహూర్తాన పుష్కరాలకు నాంది పలికారు. రాజమండ్రిలోని సరస్వతీఘాట్‌లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పుష్కర స్నానమాచరించి అధికారికంగా ప్రారంభించారు. తొలుత కంచిపీఠాధిపతులు పుణ్యస్నానమాచరించారు. తితిదే తరుపున గోదావరి మాతకు ఏపీ సీఎం చంద్రబాబు చీర, సారె సమర్పించారు. తితిదే ఈవో, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
 
ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 9గంటల వరకు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. రద్దీనిబట్టి ఆ తర్వాత కూడా అనుమతిస్తారు. సోమవారం సాయంత్రానికే సుమారు లక్ష మంది పుష్కర స్నానమాచరించారు. పుష్కర ప్రాంతాల్లో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. గోదావరి నీటిమట్టం తగ్గడంతో సీలేరు నుంచి 6వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 
 
మరో వైపు పుష్కరాలకు రూ.1600 కోట్లతో ఏపీ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో 162 పుష్కరఘాట్లు భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. రోజుకి 25 లక్షల మంది చొప్పున మొత్తం 3 కోట్ల మంది పుష్కరస్నానమాచరిస్తారని అంచనా వేస్తున్నారు. దాదాపు 70వేల మంది వివిధ శాఖల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఉదయం 8 గంటలకు పుష్కర స్నానం చేస్తారు.
 
తెలంగాణలో తొలి పుష్కరం 
తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి పొడవునా పలు క్షేత్రాల్లో ఏర్పాటైన 106 పుష్కర ఘాట్లు భక్తులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. మంగళవారం ఉదయం 6.21 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం ఆచరించి వేడుకలను ఆరంభిస్తారు. ఆయన సోమవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా ధర్మపురి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు... పుష్పగిరి, మంత్రాలయం, శ్రీశైలం, శ్రీమఠం, హంపి, తొగుట, శారదా పీఠాధిపతులు కూడా ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. కేసీఆర్‌ సతీసమేతంగా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయం వద్దకు చేరుకుని స్వామి వారి నిత్య పూజల తర్వాత... పుష్కర ప్రారంభానికి స్వామివారి ఆజ్ఞ తీసుకుకుంటారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

Show comments