Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆనంద నిలయంపై రావి మొలక... ఎప్పుడు?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:21 IST)
పేరు ప్రతిష్టలు సంపాదించిన తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీవారి ఆలయం పట్ల అశ్రద్ధతో ఉందనే విషయం మరోమారు స్పష్టమయ్యింది. ఆలయంపై రావి మొక్కలు మొలుస్తున్నాయి. అప్పుడప్పుడు ఆనంద నిలయం పై భాగాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రావి మొక్కలు బంగారు తొడుగులను కూడా చీల్చుకుని వస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై రావిమొలక వచ్చింది!
 
ఆలయ గోపురాలపై రావి మొక్కలు మొలుస్తుంటాయి. అందుకు తిరుమల ఆలయం ప్రత్యేకం ఏమి కాదు. అయితే ఆలయగోపురంపై బంగారు పూత పూసిన రేకులు బిగించి ఉంటారు. అయితే వాటికి పూత పూయడం.. శుభ్రపరచడం జరుగుతుంటుంది. అయితే ఆనందనిలయం ఆగ్నేయదిశలో ఓ రావి మొక్క పెరుగుతోంది. 
 
బ్రహ్మోత్సవాలకు ఆలయ పైభాగంలో రంగులు వేయడంవంటి పనులు చేస్తున్నా ఈ మొలకను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. చాలా గోపురాలు కూలిపోవడానికి రావిమొక్కలే కారణమనే విషయం టీటీడీకి గుర్తుండాలని పలువురు విమర్శిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

17-09-2024 మంగళవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది.. మహిమ ఏంటి?

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

Show comments