తిరుమలలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (07:16 IST)
తిరుమలలో పవిత్రోత్సవాలు వైభవంగా మంగళవారం ఆరంభమయ్యాయి. శ్రీవారికి సుప్రభాతం, మొదటి నైవేద్యం, రెండో ఘంట అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పల్లకిని అధిరోహించి పవిత్రోత్సవ మండపానికి వేంచేశారు. మండపంలో అర్చకస్వాములు ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ట చేసి వీటి మధ్య నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించారు. స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని ఆశీనుల్ని చేశారు. పట్టుపవిత్రాలను యాగశాలలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా హోమాలు నిర్వహించారు. 
 
హోమం అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేసి హోమతిలకం పెట్టిన అనంతరం భక్తులతో సంకల్పం చెప్పించారు. అనుష్ఠాన క్రియల అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలను అలంకరిస్తుండగా జీయంగార్లు, వైష్ణవస్వాములు దివ్యప్రబంధాన్ని పారాయణం చేశారు. 
 
ఏకాంతంగా నైవేద్యం నివేదన జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి సర్వాభరణాలతో, రంగురంగుల పుష్పమాలలతో అలంకరించి తిరువీధుల్లో అత్యంత వైభవంగా వూరేగించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్‌ వద్దే హోంశాఖ

గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...

బండి భగీరథ్ ఎక్కడున్నాడు? కేంద్రమంత్రి సంజయ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

Show comments