Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిలో 3 బాణాల ప్రయోగం: మహాభారతం నుంచి కాపీ కొట్టిందేనా? బార్బరిక్ ఎవరు?

బాహుబలి-2లో అమరేంద్ర బాహుబలి మూడు బాణాల ప్రయోగాన్ని దేవసేనకు నేర్పించిన సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశాన్ని జక్కన్న రాజమౌళి ట్రైలర్‌, ఫస్ట్ లుక్ పోస్టర్లలో విడుదల చేసి మంచి మార్కుల

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (16:35 IST)
బాహుబలి-2లో అమరేంద్ర బాహుబలి మూడు బాణాల ప్రయోగాన్ని దేవసేనకు నేర్పించిన సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశాన్ని జక్కన్న రాజమౌళి ట్రైలర్‌, ఫస్ట్ లుక్ పోస్టర్లలో విడుదల చేసి మంచి మార్కులు వేసుకున్నాడు. ఈ మూడు బాణాల ప్రయోగాన్ని కూడా రాజమౌళి జక్కన్న మహాభారతం నుంచి స్వీకరించారని సమాచారం. 
 
ఎలాగంటే? ఈ మూడు బాణాలను ప్రయోగించిన వ్యక్తి కథ కూడా మహాభారతంలో ఉంది. ఆయన ఎవరు..? ఆయన మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాలుపంచుకున్నాడా? అతని జాడ మరుగైపోవడానికి కారణాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే. ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే. 
 
మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధంలో మన దేశానికి చెందిన 80 శాతం మంది ప్రజలు మరణించారు. ఈ యుద్ధమే దేశంలో జరిగిన అతిపెద్ద యుద్ధమని పురాణాలు చెప్తున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు. కౌరవులు ఓడారు. ఈ యుద్ధానికి సారథిగా నిలిచిన శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభం కోసమే ఈ యుద్ధాన్ని జరిపాడని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి ఈ యుద్ధంలో నైపుణ్యుడైన మూడు బాణాలను ప్రయోగించగల యోధుడు పాలుపంచుకోలేదు. అందుకు కారణం కూడా శ్రీ కృష్ణుడే. 
 
ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించే అద్భుతమైన శక్తి ఆయనుకుంది. ఆయన ఎవరంటే..  భీమసేనుని మనువడు. ఘటోత్కజుని కుమారుడు బార్బరిక్. కానీ కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించేందుకు ముందుగానే శ్రీకృష్ణుడు బార్బరిక్‌ను చంపేశాడు. కౌరవుల చెంత నిలబడి యుద్ధం చేస్తానని తల్లి మౌర్వికి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధానికి బయల్దేరే బార్బిరిక్‌ను శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు.
 
మూడు బాణాలతో యుద్ధానికి వచ్చేసిన వ్యక్తిని చూడండి అంటూ ఎగతాళి చేస్తాడు. బార్బరిక్‌కు శివుడు ప్రసాదించిన మూడు బాణాలకు గల శక్తిని పరీక్షించదలచుతాడు. ముదుసలి రూపంలో వున్న శ్రీకృష్ణ పరమాత్ముడు బార్బరిక్‌ను ఎగతాళి చేస్తాడు. ఆ సందర్భంలో బార్బరిక్ తన బాణాలు తాను చెప్పినట్లు చేస్తాయని.. ఎవరిని కాపాడాలో కాపాడుతాయని, ఏ సైన్యాన్ని మట్టుబెట్టాలో మట్టుబెడతాయని చెప్తాడు. దీంతో బార్బరిక్‌ను అడ్డుకోకపోతే.. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ఓటమి తప్పదనుకున్న శ్రీకృష్ణుడు బార్బరిక్‌ను పరీక్షించాడు.
 
తనకు ఓ వరం కావాలని బార్బరిక్‌ను అడిగాడు. అందుకు బార్బరిక్ కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు. దీంతో బార్బరిక్‌ తల కావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటాడు. అయితే తనను పరీక్షించేందుకు ముదుసలి రూపంలో వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదని బార్బరిక్ గ్రహిస్తాడు. తన తల నరికే ముందు వచ్చిన వారెవరో.. తనను పరీక్షించదలచిన వారెవ్వరో తన ముందు కనిపించాలని వేడుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని తాను మరణించినా చూడాలనే వరాన్ని కోరుకుంటాడు. 
 
అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఆయనకు చూపిస్తాడు. ఇలా బార్బరిక్ తలను ఎత్తైన పర్వతం మీద శ్రీకృష్ణుడు వుంచుతాడు. ఈ తల యుద్ధం పూర్తయ్యాక రాజస్థాన్ ప్రాంతంలో లభించిందని.. ఆ ప్రాంతపు రాజు ఆయనకు దేవాలయం కట్టించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇలా బార్బరిక్ మరణం సంభవించిందని.. పాండవుల రక్షణార్థమై శ్రీకృష్ణుడు ఆ పని చేయాల్సి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

ఈసారి పౌరులకు డబుల్ దీపావళి.. జీఎస్టీపై భారీ కోత.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మోదీ

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ- పాక్‌కు మోదీ వార్నింగ్ (video)

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments