Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా గరుడ సేవ.. క్రిక్కిరిసిన జనం

Webdunia
ఆదివారం, 15 ఫిబ్రవరి 2015 (08:21 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామికి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గరుడసేవను వైభవంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి మాడ వీధులలో బారులు తీరారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో గరుడ వాహనంపై కళ్యాణ వేంకటేశ్వర స్వామి మాడ వీధులలో ఊరేగుతుంటే భక్తజనం పరవశించి పోయారు. 
 
గరుడ సేవకు స్థానికులు అధికంగా హాజరవుతారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆ రోజున అలంకరణ మొదలుకుని, అన్ని ఏర్పాట్లు కూడా వేరుగానే ఉంటాయి. వచ్చే భక్త జనం గరుడ వాహన దర్శనం చేసుకుంటే భయాల తొలగిపోయి శుభం కలుగుతుందని భావిస్తారు. అందుకే భారీ ఎత్తున తరలి వస్తారు. ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజీవో రవీంధ్రారెడడ్, ఎస్ఈ సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments