తిరుమలలో విపరీతమైన రద్దీ.. తోపులాట...2 కి.మీ వెలుపలకు వచ్చిన క్యూలైను

Webdunia
సోమవారం, 6 జులై 2015 (06:56 IST)
తిరుమల కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా జనమే జనం. ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడికి ప్రస్తుతం తిరుమలలో ఉన్న జనం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. వారాంతపు రోజులు కావడంతో తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం కొండపై ఎటుచూసినా బారులు తీరిన భక్తులే కనిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు, లడ్డూ కౌంటర్లు, మాడవీధులు, వాణిజ్య సముదాయాలు జనంతో నిండిపోయాయి.
 
వైకుంఠం క్యూకాంప్లెక్సులో సర్వదర్శన భక్తులు 31 కంపార్టుమెంట్లలో నిండిపోవడమే గాక.. వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లలో రెండు కిలోమీటర్ల మేరకు బారులు తీరారు. దివ్యదర్శన భక్తులు కూడా 14 కంపార్టుమెంట్లు నిండి మూడు కిలోమీటర్ల మేరకు ఉద్యానవనంలోకి చేరుకున్నారు. దీంతో సర్వదర్శనానికి 15, దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 
 
శనివారం ఒక్కరోజే దాదాపు 89 వేలమంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నారాయణిగిరి ఉద్యానవనంలోకి చేరుకున్న తాత్కాలిక క్యూలైన్‌లోకి.. దివ్యదర్శన భక్తులను వదలడంతో ఒక్కసారిగా.. తోపులాట చోటుచేసుకుంది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొంతసేపటికి క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. ఈ రద్దీ సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు... నలుగురిపై వేటు

ఢిల్లీలో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న జడ్జి

ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...

భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త

గిన్నిస్ గ్లోరీ చారిత్రాత్మక మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ పూర్తి: నవయుగకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రశంస

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2026 శుక్రవారం ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది

Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం

01-05-2026 నుంచి 31-05-2026 వరకు మీ మాస ఫలితాలు

30-04-2026 గురువారం ఫలితాలు - గ్రహసంచారం బాగుంది

Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?

Show comments