కొండపై పెళ్ళిళ్లే పెళ్లిళ్ళు

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (08:06 IST)
నవదంపతులతో తిరుమల కిటకిటలాండింది. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ల హాడావుడినే కనిపించింది. తలకు బాసికాలతో వధూవరులు తిరుమలంతా కలియదిరిగారు. ముహూర్తాలు తక్కువగా ఉండడంతో బుధ, గురువారాలలో వందల మంది పెళ్ళిళ్లు చేసుకున్నారు. బుధవారం వేకువజాము నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో వివాహ మూహూర్తాలుండడంతో నూతన జంటలు, బంధువులతో తిరుమల కళకళలాడింది.
 
పౌరోహిత సంఘంతో పాటు టీటీడీ, మఠాల్లోని కల్యాణమండపాల్లో 200కు పైగా వివాహాలు జరిగాయి. మంగళవాయిద్యాల ధ్వునులతో కల్యాణవేదిక మారుమ్రోగింది. పౌరోహితుల మంత్రాలు, బంధువుల అల్లరి మాటలు, దంపతుల తల్లిదండ్రుల హడావుడితో కల్యాణవేదికపై సందడి నెలకొంది. గురువారం తెల్లవారు జామున వరకూ ఇదే పరిస్థితి కొన సాగింది. 
 
పెళ్లిళ్లు జోరుగా జరగడంతో బాజాభజంత్రీలు, పూలమాలలు, ఇతర పూజా వస్తువులు, విందు భోజనాలకు పూర్తిగా డిమాండ్ పెరిగింది.  నూతన దంపతుల కళతో ఆలయం ప్రాంగణం కొత్తగా కనిపించింది. స్వామిని దర్శించుకున్న అనంతరం నూతన వధూవరులు అఖిలాండం వద్దకు చేరుకుని  కొబ్బరికాయలను సమర్పించారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు.. 11మంది మృతి.. 12మందికి గాయాలు

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసిన భార్య.. గుండెపోటు పోయాడని..?

చైనా మాంజా ప్రాణం తీసింది... తండ్రితో వెళ్తున్న బాలిక మెడకు చుట్టేసింది..

అమరావతిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలు.. ప్రజల్లో ఆందోళన?

ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)

అన్నీ చూడండి

లేటెస్ట్

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

Show comments