ఈ నెల 5 నుంచి పోస్టాఫీసుల్లో తిరుమల దర్శనం టికెట్లు

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను ఈ నెల 5 నుంచి పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. ‘పిడికెడు బియ్యం’ పథకం కింద పోస్టల్ సిబ్బంది సేకరించిన బియ్యాన్ని శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలోని వృద్ధాశ్రమానికి అందజేశారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోని 56, తెలంగాణలోని 39 ప్రధాన తపాలా కార్యాలయాల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు టికెట్లను తమకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. పోస్టాఫీసుల్లో రూ.300 చెల్లించి ఆ టికెట్లను పొందవచ్చునని చెప్పారు. తరువాత నిర్ణయించిన సమయం మేరకు దర్శనానికి తిరుమలకు వెళ్ళితే టికెట్లు ఉన్న భక్తులకు దర్శనం లభిస్తుందని చెప్పారు. 
 
గాంధీనగర్ పోస్టాఫీస్ సిబ్బంది సేకరించిన 50 కేజీల బియ్యాన్ని కానూరులోని వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సంపత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

Show comments