పాదరక్షలతోనే భోజనం చేయడం మంచిదా?

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (18:19 IST)
భోజనం చేసే విధానంలో మార్పులొచ్చేశాయి. ఆహారం తీసుకునేందుకు నియమ నిబంధనలు కనుమరుగయ్యాయి. ఎక్కడో ఓ చోట కూర్చుని కానించేయడం.. కుర్చీల మీద భోజనం చేసేయడం, హడావుడిగా తినడం వంటివి ప్రస్తుతం పరిపాటి అయిపోయాయి. ఇంకా దారుణం ఏమిటంటే ఫ్యాషన్ పోకడల కారణంగా పాదరక్షలను సైతం విడవకుండా అలానే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ పద్ధతి సరికాదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
భగవంతుడు అందించిన ఆహారం ఈ విధంగా స్వీకరించడం మంచిది కాదని వారు చెబుతున్నారు. ఎవరికి ఎన్ని పనులు వున్నా, ఎంత తీరిక లేకుండా వున్నా భోజనం చేసే విషయంలో కొన్ని నియమ నిబంధలను పాటించాలి.
 
స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, పద్మాసనం వేసినట్టుగా కూర్చుని నిదానంగా భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
తూర్పు ముఖంగా గానీ, దక్షిణ ముఖంగా గాని కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భోజనం చేయాలి. లేదంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తడమే కాకుండా, ఆయుష్షు, యశస్సు నశిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

దారుణం, 13 ఏళ్ల బాలికపై 5 రోజుల్లో 30 మంది అత్యాచారం

పులుల సంరక్షణకు మహారాష్ట్ర సహకారం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రన్‌వేపై పేలిన టైరు... తృటిలో తప్పిన పెను ప్రమాదం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments