Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా మందిరంలో శివపార్వతుల కుటుంబ చిత్రపటాన్ని పెట్టుకోవచ్చా?

పూజామందిరంలో శివపార్వతుల కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు.

Webdunia
గురువారం, 4 మే 2017 (17:06 IST)
పూజామందిరంలో శివపార్వతుల కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంలో ఉన్న చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచటం చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. 
 
పార్వతీపరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోనూ, ఆదరించడంలోనూ ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు. 
 
విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువల్ల వాళ్లంతా కలిసివున్న శివ కుటుంబం చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments