బతుకమ్మకు 9 నైవేద్యాలు...

బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (16:05 IST)
బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు.
 
1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 
 
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. 
 
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. 
 
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 
 
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి. 
 
6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు  నైవేద్యమేమి సమర్పించరు. 
 
7.  వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. 
 
8.  వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 
 
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. 
 
తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు  చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. గానాబజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తెకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో

Amaravati : నిఫ్ట్ కోసం అమరావతిలో పది ఎకరాల్లో శాశ్వత క్యాంపస్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తర్వాతి కథనం
Show comments