సాధారణ భక్తులకు అందుబాటులో 225 సేవా టికెట్లు

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (06:49 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేకువజామున నిర్వహించే వివిధ సేవా టికెట్లను టిటిడి భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారికి నిత్యం నిర్వహించే సేవ లైన తోమాల, అర్చన, మేల్‌చాట్‌ వస్త్రం, పూరాభిషేకం లాంటి టికెట్లను మార్చి నెలలో భక్తులకు టిటిడి సుమారు 225 టికెట్లను అందుబాటులో ఉంచింది. 
 
ఆర్జిత కుంభకోణంలో బయపడిన బల్క్‌ బుకింగ్‌ సేవాటికెట్లను టిటిడి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ టికెట్లను ల్యాటరి పద్దతిలో భక్తులకు ప్రతినెలా అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలో తోమాల సేవ 41, అర్చన సేవ 129, మేల్‌చాట్‌ వస్త్రం 09, పూరాభిషేకం 46 టికెట్లను కేటాయించింది. 
 
ఈ టికెట్లను పొందడానికి భక్తులు సేవ జరిగే ముందురోజున తిరుమలకు చేరుకుని సిఆర్‌ఓ కాంప్లెక్సులో ఉన్న విజయాబ్యాంకులో తమ పేర్లను, చిరునామాను, ఫోటో ఐడెంటీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలతో పాటు తమ మెబైల్‌ నెంబర్‌ ను కూడా ఎంట్రి చేసుకోవాలి. ఈ విధంగా సేవ జరిగే ముందురోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. శుక్రవారం సేవలకు సంబంధించిన టికెట్లను గురువారం తిరుమలలో లాటరీ పద్దతిన తీశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments