Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగ అంటే ఏమిటి... దీని ద్వారా ఏం సాధించవచ్చు?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (19:30 IST)
నేటికాలంలో యోగ అంటే శరీర వ్యాయామమని అందరికీ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందరూ అటువంటి శారీరక వ్యాయామము గురుంచి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ నిజానికి యోగ అనేది కేవలం శరీరానికే సంబంధించినది కాదు. అది ముఖ్యంగా మనస్సుకు సంబంధించినది. మనస్సును నిగ్రహించడానికే మొట్టమొదటి యోగ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఇది అనేక వేల సంవత్సరాల క్రిందటే జరిగింది.
 
మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనిషి ఈ నాలుగింటిని ఆధారం చేసుకొని కర్మలు చేస్తాడు. మనిషి వీటిలో మూడవదైన బుద్ధి ద్వారానే కార్యాచరణ లేదా కార్యసాధన జరుగుతుంది. కానీ మనస్సు చంచలత కారణంగా బుద్ధి గతి తప్పి లక్ష్యసాధన తప్పిపోతుంది.
 
అందుకే భగవద్గీతలో గీతచార్యుడు యోగానికి ఒక నిర్వచనాన్ని చెప్పాడు. యోగః కర్మసు కౌశలమ్.. కర్మలో నేర్పరితనమే యోగము. యోగ వృద్ధులకే కానీ మాకెందుకు అని విద్యార్థులు, యువత అనుకునే అవకాశం ఉంది. మనస్సుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతైన అవసరము. ప్రస్తుత కాలంలో విద్యార్ధులకు మనస్సు ఏకాగ్రత ఎంతో అవసరం.
 
ఒక విద్యార్ధి చదువులో నూటికి నూరు మార్కులు సాధిస్తున్నాడంటే మనస్సును నిగ్రహించే ఆ కార్యాన్ని సాధించాడని చెప్పవచ్చు. సాధారణంగా యువత, విద్యార్థులను తప్పుదోవ పట్టించేవి ఇంటర్నెట్, వాట్సప్ సంభాషణలు, ఫేస్ బుక్‌లో కాలం గడపడం, వీడియోలు చూడటం, మత్తు పదార్ధాలకు అలవాటు పడటం. ముఖ్యంగా లక్ష్యం లేకపోవడం. ఇవన్నీ చంచలమైన మనస్సు ద్వారా కలిగేవి.
 
కానీ ఏ విద్యార్థియైనా చదువులో సంపూర్ణ విజయాన్ని సాధిస్తున్నాడంటే, మానసిక ప్రలోభాల నుండి అతడు బయటపడినట్లేనని తెలిసుకోవాలి. అప్పుడు అతడు పూర్తిగా బుద్ధి స్ధాయిలోనే ఉంటాడు. అతడు సాధించలేని కార్యమే ఉండదు. విద్యార్ధులకు, యువతకు తమ కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది. మన లక్ష్యసాధనకు అడ్డుపడే మనస్సును నిగ్రహించు కోవాలి. మనస్సును నిగ్రహించడం వలన ఉన్నత స్థితిని చేరుకోగలం. కర్మలను తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments