Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మ సౌందర్యానికి సూర్య నమస్కారం

Webdunia
WD
సూర్యనమస్కారం అనేది పలుయోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది.

ఆసనం వేయు పద్ధతి
నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి.

గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి.

మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చమోత్తాసనం అంటారు.

గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి.

మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్కన ఉండేలా చూడాలి. భజాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శరీరం బాణం విల్లు ఆకారంలో ఉంటుంది.

WD
మెల్లగా గాలి వదులుతూ శరీరాన్ని నేలను తాకించాలి. మోకాళ్లు, అరచేతులు, ఛాతీ, నుదురు నేలను తాకుతూ ఉండాలి. అప్పుడు గాలిని మెల్లగా వదిలివేయాలి.

మళ్లీ మెల్లగా గాలి పీల్చుకుంటూ తలను వీలైనంత వెనుకకు వంచాలి. దాదాపు నడుము వరకూ శరీరాన్ని వెనక్కు వంచాలి. దీనిని భుజంగాసనం అంటారు.

మెల్లగా గాలి వదులుతూ తుంటి, తలను భుజాలతో సమాంతరంగా ఉండేలా పైకి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ పైభాగానికి విల్లులా కనిపిస్తుంది.

మెల్లగా గాలి పీల్చుకుంటూ కుడికాలిని ముందుకు తీసుకురావాలి. చేతులు సమాంతరంగా ఉంచుతూ తలపైకెత్తాలి. మెల్లగా గాలిబయటకు వదులుతూ కుడికాలును కూడా ఇదేవిధంగా ముందుకు తీసుకురావాలి. పాదాలు, చేతులను సమాంతరంగా తీసుకువస్తూ తల మోకాళ్ళను తాకేలా చూడాలి.

మెల్లగా గాలి వదులుతూ భుజాలను పైకి లేపాలి. మెల్లగా తల వెనుకకు వంచాలి. తిరిగి నమస్కార స్థితిలోకి రావాలి. తరువాత మొదటి స్థితికి చేరుకోవాలి. ఇంతటితో ఒక రౌండ్ పూర్తవుతుంది. తిరిగి ఈ ఆసనాన్ని మళ్ళీ వేయాలి.

జాగ్రత్తలు
తుంటి జారినవారు, వెన్ను నొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేయకపోవడం మంచిది. వారు ఒకవేళ ఆసనాన్ని వేయాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఉపయోగాలు
జీర్ణావయవాలు ఉత్తేజితమవుతాయి. చాలా చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చర్మంలో ఉన్న అసమానతలు, సమస్యలు తొలగిపోతాయి. చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. వెన్నుపూసకు మరింత మేలు జరుగుతుంది.

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Show comments