Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్ కట్ చేసే పదార్థాలు ఏవో తెలుసా?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (23:17 IST)
కొంత‌మంది ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాల గురించి తెలుసుకుంటే బ‌రువు పెర‌గ‌కుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు. అలాగే కొన్ని ఆహారాల ద్వారా కొవ్వు క‌రిగించుకోవ‌డం కూడా చాలా సులువుగా చేసుకోవ‌చ్చు.
 
1. ఓట్స్ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి  ఓట్స్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకి చెక్ పెట్ట‌వ‌చ్చు.
 
2. గ్రెయిన్స్ బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడ‌తాయి. గ్రైన్స్ వల్ల‌ శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గాంచుకోవ‌చ్చు.
 
3. అవ‌కాడోలో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
 
4. బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క‌ర‌కాల రూపాల్లో ల‌భించే బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు త‌గ్గించుకోవచ్చు. కొవ్వు ప‌దార్థాల‌ను క‌రిగించుకోవ‌చ్చు
 
5. పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొవ్వు ప‌దార్థాల స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణ‌మ‌వుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments