Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్స్ వద్దే వద్దు మంచినీరే ముద్దు.. జంక్ ఫుడ్స్ జోలికి అస్సలెళ్ళొద్దు...

కూల్‌డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. అలాగే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళనే వద్దంటున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రధానంగా ఒబిసిటీని కారణమవుతుంది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (17:11 IST)
కూల్‌డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. అలాగే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళనే వద్దంటున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రధానంగా ఒబిసిటీని కారణమవుతుంది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు గంటల తరబడి కంప్యూటర్లకే అతుక్కుపోవడం ద్వారా శరీరానికి తగిన వ్యాయామం లభించట్లేదు. దీనికి తోడు ఆరోగ్యానికి అవసరమైన ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోవడం ద్వారా గుండెపోటు వంటి వ్యాధులకు అనేకమంది  గురవుతున్నట్లు సర్వేలు తేల్చాయి. 
 
అందుకే కూల్‌డ్రింక్స్‌కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోవాలి. చక్కెర శాతం ఉన్న నానారకాలైన పానీయాల కంటే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తూనో, కంప్యూటర్‌ ముందు కూర్చునో చిప్స్‌ వంటి స్నాక్స్‌ తినడం కన్నా ఇంట్లో రక రకాల పండ్లను నిలువ పెట్టుకుని, జంక్‌ఫుడ్‌ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
 
ఉదయం పూట తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. తీసుకునే అల్పాహారంలో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. తద్వారా బరువు తగ్గించుకోవడం సులభం అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే... పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా.. తృణధాన్యాలు, ఆకుకూరలు, జామ, ఉసిరి, నేరేడు పండ్లు డైట్‌లో చేర్చుకోండి. 
 
జంక్‌ఫుడ్‌ తీసుకునే టీనేజర్లు, జంక్‌ఫుడ్‌ తీసుకోని వారికంటే అధిక బరువు పెరగడం, చురుకుదనం కోల్పోవడం వంటి జరుగుతాయి. జంక్ ఫుడ్స్ ద్వారా శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్‌ వంటి పోషక పదార్థాలు దూరమవుతాయి. సో.. జంక్ ఫుడ్స్.. కూల్ డ్రింక్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments