Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరానికి శక్తినిచ్చి ఉత్సాహాన్నిచ్చే అరికాళ్ల మసాజ్

నిత్య జీవితంలో నేడు ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి లోనవుతున్న విషయం అందరికీ విదితమే. శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతిరోజు అరికాళ్లను మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడులను అధికమించవచ్చు. మసాజ్ చేసుకునే ముందు అరికాళ్లను ముందు

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (14:47 IST)
నిత్య జీవితంలో నేడు ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి లోనవుతున్న విషయం అందరికీ విదితమే. శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతిరోజు అరికాళ్లను మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడులను అధికమించవచ్చు. మసాజ్ చేసుకునే ముందు అరికాళ్లను ముందుగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నాలుగైదు చుక్కల నూనెతో మెల్లగా మర్దన చేయాలి. రెండుమూడు వేళ్లతో కండరాల మీద ఒత్తిడి చేస్తూ మసాజ్‌ మొదలెడితే మంచిది. 
 
వీలైనంత వరకు బొటన వేలితో ఒత్తిడిని పెంచాలి. ఈ మసాజ్‌ వల్ల శరీరంలో అనుకోని మార్పులు జరిగి సత్వరమే రిలాక్సేషన్‌ లభిస్తుంది. శరీరంలోకి కొత్త శక్తి వచ్చి చేరుతుంది. ఈ మసాజ్ వల్ల కండరాల్లో అక్కడక్కడ ఏర్పడిన బ్లాకేజీలు తొలగి, రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శక్తి శరీరమంతా వ్యాపిస్తుంది.
 
దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగుతుగా ఉండే సాక్సులు, షూస్‌ వేసుకోవడం వల్ల అరికాళ్లకు గాలి తగలదు. ఒట్టి కాళ్లతో నేల మీద నడిచేందుకు వీలుండదు. తద్వార రక్తప్రసరణ సరిగా సాగదు. కాబట్టి షూష్‌ ఎక్కువగా వేసుకునే వాళ్లు వారానికి మూడుసార్లు అయినా కాళ్లను మసాజ్‌ చేయించుకుంటే మంచిది అని నిపుణులు చెపుతున్నారు. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగితే ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు దరి చేరవు. 
 
మహిళలు గర్భం దాల్చినప్పుడు కాళ్ల వాపులు సహజం. ఎక్కువ దూరం నడవకపోవడం వల్ల కాళ్ల నొప్పులు మొదలవుతాయి. వాపులు ఎక్కువయ్యే కొద్దీ ఇతరత్రా సమస్యలు వస్తాయి. ఇటువంటి వాళ్లు రోజూ పడుకునేప్పుడు పదిహేను నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్‌లు చేయించుకుంటే ఉత్తమం. డిప్రెషన్‌, యాంగ్జయిటీ, స్ట్రెస్.... ఇవన్నీ మెల్లగా మనిషి ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే జబ్బులు. వీటిని తగ్గించుకోవటానికి రిలాక్సేషన్‌ టెక్నిక్‌లు అనుసరించాలి. ఈ టెక్నిక్స్‌లో అద్భుత ఫలితాలనిస్తుంది ఫుట్‌ మసాజ్‌. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత లభిస్తుంది.
 
మెనోపాజ్‌, పిఎంఎస్‌ సమస్యలు అనేకం. ఉన్నట్లుండి మూడ్‌ మారిపోవడం, చికాకు, కోపం, తలనొప్పి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి ఇవన్నీ పట్టుకుంటాయి. ఈ సమస్యలతో బాధపడేవాళ్లు.. ఫుట్‌ మసాజ్‌ను ఆశ్రయించొచ్చు. రోజూ చేసుకుంటే సమస్యలు కొంతవరకు తగ్గుతాయనడంలో సందేహం లేదు. ఆఫీసులో పని ఒత్తిడి, లక్ష్యాల వల్ల ఆందోళన, ఒత్తిడి కలుగుతుంటుంది. వేళకు తినకపోవడం, జంక్‌ఫుడ్‌ను ఆశ్రయించడం, జీర్ణశక్తి తగ్గడం వంటి అనేక రకాల సమస్యల వల్ల అధిక రక్తపోటు వస్తుంది. రోజుకు కనీసం పది నిమిషాల పాటు ఫుట్‌ మసాజ్‌ చేసుకుంటే అధిక రక్తపోటు ద్వారా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్: అమిత్ త్రివేది, నిఖిత గాంధీ, రఫ్తార్, డిజే యోగీల గొప్ప పెర్ఫార్మెన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments