Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్ నట్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా డ్రై ప్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంత

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (20:10 IST)
సాధారణంగా డ్రై ప్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. ఈ వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
 
2. వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్ని రకాల హార్ట్ డిసీజస్‌ను ఎదుర్కొనడానికి  సహాయపడతాయి. 
 
3. వీటిలో విటమిన్ ఇ మరియు ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది. కనుక దీనిని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు.
 
4. ప్రతిరోజు మన డైట్లో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. 
 
5. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకోవటం వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి. 
 
6. గర్భిణీ స్త్రీలు ఈ నట్స్‌ను తినడం వలన లోపల ఉన్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు కలుగకుండా వ్యాధినిరోధకతను పెంచుతాయి.
 
7. ప్రతిరోజు వీటిని మన డైట్లో చేర్చుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది.
 
8. వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments