Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నబడాలనుకునేవారు.. డ్రైఫ్రూట్స్‌తో పాటు బ్రౌన్ రైస్ తీసుకోండి..

సన్నబడాలనుకునేవారు తీసుకునే పదార్థాల్లో అసలు ఫాట్ లేకుండా చూసుకోవాలి. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్‌ కూడా కొంతమేరకే తీసుకోవాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేకుంటే నెల

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (08:40 IST)
సన్నబడాలనుకునేవారు తీసుకునే పదార్థాల్లో అసలు ఫాట్ లేకుండా చూసుకోవాలి. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్‌ కూడా కొంతమేరకే తీసుకోవాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేకుంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. 
 
పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. 
 
బరువు పెరగడానికి మనం తీసుకునే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. ఏవి పడితే అవి కాకుండా మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్‌, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌ వంటివి ఎంచుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments