పుదీనా, తులసి ఆకులు కలిపి నమిలి ఆ రసాన్ని మింగితే...

మనం తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, అధిక మొత్తంలో ఆహారం తీసుకున్నా అది కడుపునొప్పిగా వస్తుంది. అలాంటప్పుడు ఆ బాధను తగ్గించుకోవడానికి మనం మందులు వాడుతుంటాము. కానీ అది తాత్కాలికంగా తగ్గినా మరో ఆరోగ్య సమస్యకు దారి తీస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కా

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (21:44 IST)
మనం తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, అధిక మొత్తంలో ఆహారం తీసుకున్నా అది కడుపునొప్పిగా వస్తుంది. అలాంటప్పుడు ఆ బాధను తగ్గించుకోవడానికి మనం మందులు వాడుతుంటాము. కానీ అది తాత్కాలికంగా తగ్గినా మరో ఆరోగ్య సమస్యకు దారి తీస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు మన ఇంట్లోనే ఉన్న కొన్ని రకాల పదార్థాలతోనే ఈ కడుపునొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. నిమ్మకాయ ఆరోగ్యానికి ఔషధం అని చెప్పవచ్చు. నిమ్మకాయలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం మరియు ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
 
2. ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
 
3. కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్బుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వలన కడుపునొప్పి త్వరగా తగ్గుతుంది.  
 
4. ఒక స్పూన్ తేనెకు అర టీస్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి, ఉదర సంబందిత సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది.
 
5. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.
 
6. బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
 
7. పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసి మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్

నేడు కేంద్ర వార్షిక బడ్జెట్... ఆదాయపు పన్ను మార్పులపై గంపెడాశలు

బాలికపై తండ్రి - మేనమామ లైంగికదాడి.... గర్భందాల్చడంతో...

Ambati Rambabu: చంద్రబాబుపై కామెంట్లు.. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు (video)

5555: కుప్పంలో గిన్నిస్ రికార్డ్.. జగన్ సెటైర్లకు చంద్రబాబు అలా చెక్ పెట్టారు.. ఈ-సైకిల్‌పై జర్నీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments