అంతర్గత ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు...?

బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ముఖం కడిగి పౌడర్ పూసి జుట్టు దువ్వి అందంగా తయారయ్యేందుకు ఎన్నో కాస్మోటిక్స్ వాడటం ఇటీవలి కాలంలో అధికమైంది. కానీ శరీరంలోచేరిన మలిన పదార్థాలను బయటకు పంపడం, ప్రమాదకర పదార్థాలను విచ్ఛి

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (18:21 IST)
బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ముఖం కడిగి పౌడర్ పూసి జుట్టు దువ్వి అందంగా తయారయ్యేందుకు ఎన్నో కాస్మోటిక్స్ వాడటం ఇటీవలి కాలంలో అధికమైంది. కానీ శరీరంలోచేరిన మలిన పదార్థాలను బయటకు పంపడం, ప్రమాదకర పదార్థాలను విచ్ఛిన్నం చేసి ప్రమాద రహితమైనవిగా మార్చేందుకు అనుసరించాల్సినవి మాత్రం చేయడంలేదు. 
 
కాలేయం, మూత్రపిండాలు అంతర్గత మలినాలను వదిలించుకునే బాధ్యతను నిర్వహిస్తాయి. ఇవేకాక శోషరస వ్యవస్థ ముఖ్యపాత్ర వహిస్తుంది. అటువంటి వ్యవస్థలు దెబ్బతినకుండా చూసుకోవాలి. వాటి మెరుగైన పనితీరు బాగుండాలంటే శరీరానికి తగినంత నీరు అందించాలి. కేవలం దాహం వేసినపుడే నీరు తాగుతాను అనుకుంటే ఇబ్బంది వస్తుంది. 
 
రక్తంలో పలురకాల మలినాలు చేరుతుంటాయి. వాటిని వదిలించకపోతే పలు అనారోగ్యాలు వస్తాయి. అందుకు తగినంతనీరు తాగి రక్త శుద్ధి జరిగేట్లు చూసుకోవాలి. ఎంత స్వచ్చ మైన నీరు, ఎంత ఎక్కువ మోతాదులో అందిస్తే శరీరానికి అంత మంచిది. గాలి కూడా ఒరరకమైన ఇంధనం. గాలి బాగా పీల్చి వదలగలిన యెగా, ఎయిరోబిక్స్ వంటివి తప్పకుండాచేయాలి. 
 
జీర్ణ వ్యవస్థలో తయారయ్యే వ్యర్థాలు మల రూపంలో బయటకు పంపబడాలి. మలం ఎక్కువ సేపు నిలువ ఉండకూడదు. కాబట్టి రోజూ మల విసర్జన చేయాలి. ఇది క్రమబద్ధంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. మలబద్దకం రానివ్వని తాజా కూరగాయలు, ఆకు కూరలు ఆహారంగా తీసుకోవాలి. శరీరం విషయంలో కొద్దిపాటి శ్రద్ధ మనం చూపితే ఆ శరీరంలోని అంగాలు మనకు ఆరోగ్యం, ఆనందం అందిస్తాయి. బ్రతికినంత కాలం హుషారుగా వుండవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments