అవి తింటే శృంగార సమస్యలు దూరం...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (18:42 IST)
మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండాలంటే మనం తినే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. తీసుకునే ఆహారం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధుల ముప్పునుండి తప్పించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. ఆపిల్‌లో ఉండే ఫైబర్‌లు ఎక్కువ సమయం ఆకలి అవకుండా చూస్తాయి. దీనితోపాటు ఆపిల్ శరీర శక్తిని పెంచటమే కాకుండా, వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. 
 
2. మోనో సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను అధికంగా కలిగి ఉండే వాల్నట్స్ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచటమే కాకుండా, లైంగిక వాంఛను కూడా పెంచి, శృంగార సమస్యలను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఒమేగా ఫాటీ ఆసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. 
 
3. విటమిన్ సి అధిక మొత్తంలో కలిగి ఉండే బ్రోకలీ కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్‌లను కూడా కలిగి ఉంటుంది. వీటి వలన శరీరంలో కేన్సర్ వ్యాధి పెరుగుదల కూడా నివారించబడుతుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే ఫైబర్‌లు, రక్తపీడనాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులకు గురవకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
4. చేపలో ఎక్కువగా ఒమేగా ఫాటీ ఆసిడ్‌లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను తగ్గించటమే కాకుండా, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే ప్రోటీన్లు శరీరానికి అన్ని విధాల సహాయపడతాయి. సాల్మన్ ఫిష్ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కావున వారంలో కనీసం 3 సార్లయినా వీటిని తీసుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం