Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత గింజల పొడిని పాలతో తీసుకుంటే...

చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాగా పండిన చింత కాయల నుంచి చింత పండును వేరు చేశాక.. చింత గింజలు లభ్యమవుతాయి. వీటిని సేక‌రించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (22:37 IST)
చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాగా పండిన చింత కాయల నుంచి చింత పండును వేరు చేశాక.. చింత గింజలు లభ్యమవుతాయి. వీటిని సేక‌రించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌ర్వాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్నచిన్న ముక్క‌లుగా చేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి. 
 
ఈ పొడిని జార్‌లో నిల్వ ఉంచుకుని ప్రతి రోజూ అర టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుంచి 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. 
 
ఈ చింత గింజల మిశ్ర‌మంతో కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌టం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments