Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారానికి అర్థగంట ముందు సబ్జా గింజలు తింటే...

చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు రెండు పూటలా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రతిరోజూ రెండు పూటలూ ఆహారానికి ముందు సబ్జా గింజలను తీసుకుని ఆరగించ

Webdunia
బుధవారం, 24 మే 2017 (13:04 IST)
చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు రెండు పూటలా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రతిరోజూ రెండు పూటలూ ఆహారానికి ముందు సబ్జా గింజలను తీసుకుని ఆరగించినట్టయితే బరువు సులభంగా తగ్గిపోతారు. బరువు తగ్గడానికి ఇదే అతి సులువైన మార్గంగా చెప్పొచ్చు. 
 
ఈ గింజలు అనేక సమస్యలను పరిష్కరించి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చూసేందుకు చిన్నగా, నలుపురంగులో ఉండే ఈ గింజలు నీటిలో నానితే పెద్దగా ఉబ్బుతాయి. ఈ గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. వీటిని వంటల్లో వాడటం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఈ గింజల్ని నానబెట్టి ఆహారపదార్థాల్లో, జ్యూసుల్లో వేసుకుని తీసుకోవచ్చు. అంతసమయం లేదనుకొనేవారు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, తర్వాత వడకట్టి ఆ నీటిని తాగొచ్చు లేదా ఆ గింజల్ని తినొచ్చు. 
 
పైగా కెలొరీలు పెద్దగా ఉండవు. రోజూ ఈ సబ్జానీటిని తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ముఖం కళగా కనిపిస్తుంది. అదేసమయంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కూడా అదుపులో ఉంటుంది. వినికిడి సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
1. ఎన్నో ఔషధ గుణాలున్న సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అదుపులోనూ ఉంచుతుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. 
2. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ఫలితముంటుంది.
3. బరువు తగ్గాలనుకునేవారు సబ్జా గింజలను నానబెట్టి.. ఆ నీటిని తాగినట్టయితే ఫలితం ఉంటుంది. సబ్జా గింజలు నానబెట్టిన నీరు యాంటీ బయాటిక్‌లా పని చేస్తుంది. 
4. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. 
5. ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. 
6. సబ్జా గింజలు వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments