Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలంలో ఒంటిలోని వేడిని తగ్గించే ఒకే ఒక్క పండు..?

కర్భూజ పండు. ఈ పండును ఇంగ్లీష్‌లో మస్క్ మిలన్ అంటారు. ఈ కాలంలో కర్భూజ పండు ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ - సి

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (21:55 IST)
కర్భూజ పండు. ఈ పండును ఇంగ్లీష్‌లో మస్క్ మిలన్ అంటారు. ఈ కాలంలో కర్భూజ పండు ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ - సి, విటమిన్ - ఎ, ఫ్లోరిక్ ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఈ పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు.
 
ఎండాకాలంలో లభించే ఈ పండును తింటే శరీర వేడిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒంటికి చలువ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వారు ఈ పండును తింటే మంచి ఫలితం ఉంటుందట. 
 
కర్భూజ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం, ఆకలి అనిపించకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఎముకలకు కావాల్సినన్ని పోషకాలకు అందించి ఎముకలను బలంగా మారుస్తుంది. ఇందులోని విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండాకాలంలో త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ పండును తీసుకుంటే తొందరగా రికవరీ అవుతుంది. అలాగే కళ్ళకు కూడా బాగా సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments