Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ టిప్స్: చెమట స్మెల్‌కు కర్పూరంతో చెక్

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (15:13 IST)
వేసవిలో చర్మం, కంటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కంటి మంటను నివారించుకునేందుకు కీరదోసను ఉపయోగించాలి. కీరదోస ముక్కల్ని కట్ చేసి కంటిపై ఉంచితే ఉష్ణం తగ్గడంతో పాటు కంటి కిందటి వలయాలను తొలగించుకోవచ్చు. అలాగే చర్మ సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

జిడ్డు చర్మానికి చెక్ పెట్టాలంటే.. మొటిమల నుంచి దూరంగా ఉండాలంటే.. ఫ్యాటీయాసిడ్స్ గల సబ్బుల కంటే ఆయిల్ ఫ్రీ సోపులు వాడొచ్చు. వీటిని ఉపయోగించడం ద్వారా వేసవిలో తాజాగా ఉండొచ్చు. ఆయిల్ ఫ్రీ క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్లు వంటివి ఉపయోగించవచ్చు.  
 
అలాగే కీరదోస, ఖర్బూజ రసం చెరో రెండు స్పూన్లు తీసుకుని ఒక స్పూన్ సున్నిపిండి చేర్చి పది నిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు చర్మాన్ని తొలగించుకోవచ్చు. ఇంకా రెండు స్పూన్ల కొబ్బరి నీరు, తేనె కలిపి ముఖం, మెడ, చేతులకు రాసుకుని పది నుంచి 30 నిమిషాల తర్వాత కడిగిస్తే చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. 
 
స్నానం చేసేటప్పుడు చెమట స్మెల్ రాకుండా ఉండాలంటే.. గోరువెచ్చని నీటిలో కాస్త వేపాకును వేసుకోవాలి. అలాగే ఒక బకెట్ నీటిలో అరస్పూన్ కర్పూరం చేర్చి ఆ నీటితో స్నానం చేస్తే.. చెమట వాసన ఉండదు. వేసవిలో ముఖానికి ఫ్రూట్స్‌తో కూడిన ఫేషియల్ చేయడం మంచిది.

ఆపిల్, అరటి పండు, కర్భూజ, కీరదోస, కొబ్బరినీళ్లను ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. వేసవిలో బయట తిరగాల్సి వచ్చినప్పుడు కొబ్బరి నీరు, ఆరెంజ్, నిమ్మరసం తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments