Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రించే ముందు పుస్తకాన్ని చదివి పడుకుంటే ఏమవుతుంది...?

* బెడ్‌రూమ్‌ను ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. * బెడ్‌రూమ్ ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. * సాయంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. * రాత్రి పూట గోరువెచ్చని

Webdunia
మంగళవారం, 14 జూన్ 2016 (16:09 IST)
* బెడ్‌రూమ్‌ను ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. 
* బెడ్‌రూమ్ ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. 
* సాయంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
* రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
* ప్రతిరోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.
* రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపైనా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. 
* నిద్రకు ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియళ్లు చూడకూడ‌దు.
* గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దానివల్ల బాగా నిద్ర పడుతుంది.
* నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
* ముఖ్యంగా పొగ‌తాగే అలవాటును పూర్తిగా మానుకోండి.
* నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
* నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయవద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.
* ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments