Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడునెలలు ఇలా చేస్తే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవచ్చు...

ఊబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయాల్లో అన్నం మానేయడం చాలా మంచి పద్థతి. రాత్రి సమయాల్లో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించే సమయంలో మన శక్తి ఏ మాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వా

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (15:33 IST)
ఊబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయాల్లో అన్నం మానేయడం చాలా మంచి పద్థతి. రాత్రి సమయాల్లో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించే సమయంలో మన శక్తి ఏ మాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన కాలరీలో పొట్టలో అలాగే డిపాజిట్ అవుతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో క్రొవ్వు మిగిలిపోయి లావయ్యే ప్రమాదం ఉంది.
 
రాత్రి సమయాల్లో భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతిని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లేటు నిండుగా భోజనం చేసినా, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తి ఇస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తుంది కానీ చపాతీల్లో క్రొవ్వు పదార్థాలు మాత్రం ఉండవు. 
 
గోధుమ పిండిలో విటమిన్ - బి, ఈ, కాపర్  అయోడిన్, జింక్, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చపాతీలు చాలా బాగా జీర్ణమవుతాయి. జీర్ణవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడిపై పడవు. చపాతీని కూడా ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. ఇలా మూడునెలల పాటు చేస్తే మీ శరీరంలో మార్పులు కనిపించి మీకు మీరే కొత్త కనిపిస్తారంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments