Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనాను వేసవిలో ఇలా వాడితే...?

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (19:39 IST)
Pudina
పుదీనాను వేసవిలో ఇలా వాడవచ్చు. కూరలు, చట్నీల్లో కాకుండా.. పుదీనాను జ్యూస్‌లలో కలిపి తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. పుదీనా నిజానికి మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఇందులో ఉంటాయి. క‌నుక వేస‌విలో పుదీనాను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పుదీనాను తీసుకోవ‌డం వ‌ల్ల ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. ఎండ‌లో బాగా తిరిగేవారు ఇంటికి చేరుకోగానే పుదీనా మ‌జ్జిగ తాగితే శ‌రీరం వెంట‌నే చ‌ల్ల‌బ‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు పుదీనాను తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 
పుదీనాను వేస‌విలో మ‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు. లేదా నేరుగా పుదీనా ర‌సం తీసుకోవ‌చ్చు. అదీ కూడా వ‌ద్దనుకుంటే పుదీనాను స‌లాడ్స్ లో వేసుకుని తిన‌వ‌చ్చు. లేదా పుదీనా టీ తాగ‌వ‌చ్చు. ఎలా తీసుకున్నా పుదీనాతో మ‌న‌కు లాభ‌మే క‌లుగుతుంది.
 
వేస‌విలో మాంసాహారం తింటే కొంద‌రికి ప‌డ‌దు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరం వేడి చేయ‌కుండా ఉంటుంది. ద‌గ్గు, జ‌లుబు, నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పుదీనాను తింటే ఫ‌లితం ఉంటుంది. పుదీనాను రోజూ తింటే మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments