Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టని కరిగించే అనాస పండు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...

పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంటుంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.

Webdunia
శనివారం, 2 జులై 2016 (18:10 IST)
పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంటుంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.
 
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధంలా ప‌ని చేస్తుంది. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది. అనాస పండు ముక్కలను తేనెలో కలిపి తింటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపు సంతరించుకుంటుంది. 
 
అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి.గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకి నాలుగు సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
 
పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి.
 
అనాసపండుకు పచ్చకామెర్లను నయం చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది మూత్రపిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది.ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి. అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments