Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ పల్లీలు తింటే కొవ్వు పెరుగుతుందా?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:30 IST)
వేరుశనగ పప్పులు.. వీటినే పల్లీలు అని కూడా అంటారు. వీటిని తింటే లావు పెరిగిపోతారని, కొవ్వు పేరుకుపోతుందని, గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అపోహ. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉడకబెట్టి తినడం, వేయించుకుని తినడం లేదా పచ్చడి, కూరలు చేసుకుని తినడం ఇలాగ ఎలా అయినా తీసుకోవచ్చు. 
 
బెండకాయ ఫ్రైలో పల్లీలు, దొండకాయ ఫ్రైలో పల్లీలు, అంతేకాదు పల్లీలలో రకరకాల స్వీట్లు తయారు చేసుకుని తింటుంటారు. పల్లీలను తినడం వలన ఆలోచనాశక్తి పెరుగుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పల్లీల్లో ప్రొటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి. అవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
పల్లీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. అంతేకాదు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పల్లీలను ఆహారంలో భాగం చేసుకోండి. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments