Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి ఆకుల‌తో డెంగ్యూకు చెక్... ఇంకా ఎన్నో ఉపయోగాలు...

డెంగ్యూ వ్యాధి వ‌చ్చిన వారి ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అస‌లు ఒకచోట స‌రిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (16:50 IST)
డెంగ్యూ వ్యాధి వ‌చ్చిన వారి ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అస‌లు ఒకచోట స‌రిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా త‌గ్గుతుంది. దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాధార‌ణ వ్య‌క్తుల్లో ప్లేట్‌లెట్లు 1.50 ల‌క్ష‌ల నుంచి 4.50 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే, డెంగ్యూ వ‌చ్చిన వారిలో 1.50 ల‌క్షల క‌న్నా త‌క్కువ‌గా ఉంటుంది. 
 
గంట‌లు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్య‌లో ప‌డిపోతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డం కోసం వైద్యులు ప‌లు ర‌కాల మందుల‌ను, విట‌మిన్ స‌ప్లిమెంట్ల‌ను రోగుల‌కు అందిస్తారు. రోగి కొద్దిగా కోలుకున్న త‌రువాత డిశ్చార్జి చేస్తారు. కానీ కొన్ని రోజులవ‌ర‌కు వారు మందుల‌ను స‌క్ర‌మంగా తీసుకోవాల్సిందే. స‌రైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను త్వ‌ర‌గా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది. 
 
ఇంత‌కీ ఆ మందు త‌యార‌య్యేది బొప్పాయి ఆకుల‌తోనే... బొప్పాయి పండు ఆకుల‌తో త‌యారు చేసిన ఓ మిశ్ర‌మాన్ని సేవించ‌డం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. ఆ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయాలంటే, కొన్ని బొప్పాయి ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, చిటికెడు ప‌సుపుల‌ను కూడా వేయాలి. అనంత‌రం అన్ని ప‌దార్థాల‌ను బాగా మిక్సీ ప‌ట్టాలి. అప్పుడు వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌బోసి, దానికి కొంత తేనె క‌లిపి నిత్యం రెండు పూట‌లా తీసుకోవాలి. డాక్ట‌ర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు ఈ మిశ్ర‌మాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం క‌నిపిస్తుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెర‌గ‌డ‌మే కాదు, త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments