Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువుకు వంద గ్రాముల గుగ్గిళ్లు.. నువ్వుల కారం..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (19:25 IST)
అధిక బరువును తగ్గించాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజూ ఉదయం వంద గ్రాముల ఉలవ గుగ్గిళ్లు తీసుకుంటే సన్నబడతారు. 
 
అలాగే పచ్చి బొప్పాయి కూర  వండుకుని తినడం ద్వారా ఒంట్లో చెడు నీరు తొలగిపోతుంది. అలాగే నువ్వుల కారం బరువును తగ్గిస్తుంది. దీన్ని వాడితే ఒంట్లో వాతం, శరీరంలో చెడు నీరు తొలగిపోతుంది.
 
తిప్పతీగ పొడి, త్రిఫలం చూర్ణం సమానంగా తీసుకుని ఒక చెంచా తీసుకుని ఒక గ్లాసు నీళ్ళతో కషాయంగా ఒక చెంచా తేనెతో తీసుకుంటే ఒంట్లో వున్న కొవ్వు కరిగి ఒంటి నొప్పులు తగ్గుతాయి.
 
మునగ చెట్టు బెరడు 20 గ్రాములు, అర లీటరు నీటిలో వేసి పావు లీటరు కషాయం వచ్చేంత వరకు మరిగించి అందులో దోరగా వేయించిన చిత్రమూలం పొడి 1 గ్రాము, పిప్పలి చూర్ణం 2 గ్రాములు, సైంధవ లవణం 3 గ్రాములు కలిపి తాగుతూ వుంటే కుండలాగా వున్న పొట్ట తగ్గిపోతుంది. 
 
ఇంకా ఎన్నో తరాల నుంచి నువ్వుల కారం వాడకం మనకు చాలా అలవాటే. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే వాతం తగ్గిపోతుంది. బరువు పెరగరు. 
 
శొంఠి, మిరియాలు, సైంధవ లవణం, పిప్పళ్లు, వాము, జీలకర్ర సమ భాగాలుగా చూర్ణాన్ని మూడు వేళ్లకు వచ్చినంత చూర్ణాన్ని పావు లీటరు ఆవు మజ్జిగలో కలుపుకుని రెండు పూటలా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments