Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? బచ్చలికూర, చికెన్ తినండి..

బచ్చలి కూరతో పాటు చికెన్‌కు వారానికి ఓసారి మితంగా తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. ఇంకా మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీర బరువును తగ్గి

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:10 IST)
మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? అయితే బచ్చలికూర తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ సమస్య చాలామందిని వేధిస్తోంది.  2025 నాటికి ఒక్క మనదేశంలోనే ఈ వ్యాధి బాధితుల సంఖ్య ఆరుకోట్లకు చేరుతుందని అంచనా. ఈ వ్యాధి మందులకు తగ్గకపోవడం.. పెయిన్ కిల్లర్స్‌కే పరిమితం కావడమే ఇందుకు కారణం. నొప్పి తగ్గాలంటే..? పెయిన్‌కిల్లర్లు వాడక తప్పడంలేదు. అవి దీర్ఘకాలికంగా వాడితే కాలేయం మీద ప్రభావం పడుతుంది. అందుకే ప్రత్యామ్నాయం మీద దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇందులో భాగంగా వారానికి ఓసారి బచ్చలికూర తినాలని వారు సలహా ఇస్తున్నారు. ఇందులోని ఐరన్.. మోకాలి నొప్పులను దూరం చేస్తుంది. మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే.. ఈ రోగాన్ని దూరం చేసే శక్తి బచ్చలి కూరలో ఎక్కువగా వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బచ్చలి కూరతో పాటు చికెన్‌కు వారానికి ఓసారి మితంగా తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. ఇంకా మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీర బరువును తగ్గిస్తాయి. తద్వారా మోకాళ్ల నొప్పులను నయం చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలను తీసుకుంటూ ఫాస్ట్ ఫుడ్‌ను పక్కనబెడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments