Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులతో కొలెస్ట్రాల్‌కు చెక్

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (15:59 IST)
నేటి ఆధునిక సమాజంలో అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ బీపీ బారిన పడుతున్నారు. తద్వారా ఆవేశం, కోపం, అనారోగ్యం, గుండెపోటు వంటి అనేక రకాలైన వ్యాధి పీడుతులవుతున్నారు. 
 
అందుకు ముఖ్య కారణం కొలెస్ట్రాల్ (కొవ్వు). కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. 
 
ఫ్యాట్‌లెస్ ఫుడ్స్ అంటూ చేసే ప్రచారంతో ప్రతి పదార్థం తినేముందు ఇందులో కొవ్వు ఎంత ఉందో, ఆ కొవ్వు ఏమి చేస్తుందోనన్న భయంతో తినాల్సి వస్తోంది. ఇంతకీ కొలెస్టరాల్ తగ్గించగల పదార్థాలేమిటో చూద్దాం.
 
పుట్టగొడుగులు: కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడంలో పుట్టగొడుగుల్లోని బి, సి, క్యాల్షియం విటమిన్లతోపాటు ఇతర మినరల్స్ బాగా పనిచేస్తాయి. 
 
ఓట్ మీల్: దీనిలోని బీటాగ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పాంజివలే పనిచేసి కొలెస్టరాల్ ను గ్రహిస్తుంది. 
 
ద్రాక్ష పళ్లు: ద్రాక్షలోని ముఖ్యమైన అంతోసైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్టరాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాసియం, శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం.
 
క్యారెట్: కొలెస్టరాల్ నిల్వలను తగ్గించడంలో క్యారెట్లోని బీటాకెరొటీన్ తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటుంటే శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు పదిశాతం తగ్గుతాయి. 
 
మిరియాలు: నల్లమిరియాలు శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు బాగా తగ్గిస్తాయి. గుండెను వ్యాధులబారి పడకుండా రక్షిస్తాయి. వీటిలోని కాప్సిసిన్ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments