Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే.. మెట్లెక్కి దిగండి.. సైకిల్ తొక్కండి.. స్కిప్పింగ్ ఆడండి

రోజూ అరగంట పాటు నడక.. అరగంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా బరువు తగ్గుతారు. వీలైనంతవరకు నడకకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇది వ్యాయామంలా అనిపించకపోయినా.. తెలియకుండానే కెలోరీలు ఖర్చైపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (13:11 IST)
రోజూ అరగంట పాటు నడక.. అరగంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా బరువు తగ్గుతారు. వీలైనంతవరకు నడకకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇది వ్యాయామంలా అనిపించకపోయినా.. తెలియకుండానే కెలోరీలు ఖర్చైపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జిమ్‌లకు వెళ్లకుండా ఇంట్లోనే మెట్లెక్కి దిగడం, కూర్చున్న చోటే కాళ్ళు, చేతుల్ని సాగదీయడం.. గుంజిళ్ళు తీయడం చేతుల్ని గుండ్రంగా తిప్పడం వంటివన్నీ వ్యాయామంలో భాగమేనని గుర్తించాలి. 
 
సైకిలు తొక్కడం మొదలుపెట్టండి. చిన్నచిన్న పనులకు దానిపై వెళ్లడం అలవాటుగా మార్చుకుని చూడండి. అలాగే ఓ పదినిమిషాలు దొరికాయా. ఆ కాసేపూ స్కిప్పింగ్ ఆడండి. లేదా ఉన్నచోటే గెంతడం చేయండి. లేదా ఏదైనా డ్యాన్స్ క్లాసులో చేరండి. తప్పనిసరిగా వ్యాయాయమే చేయాలనే నియమాన్ని పెట్టుకోకుండా టైమ్ దొరికితే అలా నడవడం, గెంతడం, మెట్లెక్కి దిగడం వంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments