Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం టీ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (11:05 IST)
చాలా మందికి ఉదయాన్నే వేడి వేడి టీ గొంతులో పడితే గానీ మనసు ఊరుకోదు. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు. టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
ప్రయాణాలలో కడుపు తిప్పే వారికి, వాంతులు అయ్యే వారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా అల్లం టీ చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్యాఔషధంగా పనిచేస్తుంది. 
 
అప్పుడు వచ్చే నొప్పి దూరం అవుతుంది. దీనిని రోజూ త్రాగితే మరీ మంచిది. 40 దాటిన వ్యక్తులకు నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అల్లం టీ తాగవచ్చు. జలుబు, జ్వరం ఉన్నవారు అల్లం టీ త్రాగాలి. 
 
మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతత కోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. 
 
* 40 దాటితే నడుము నోప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. అల్లంటీని రోజూ తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. 
* సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.
* అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లంటీకి ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.
* శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతతకోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
* మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments