Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది తెలిస్తే బత్తాయి రసం తప్పక తాగుతారు...

వేసవి కాలం వచ్చింది. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువుగా ఉంటుంది. దీని నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువ మోతాదులో పండ్లు, పండ్లరసాలు, మంచినీరు, మజ్జిగా ఎక్కువుగా తాగుతూ ఉండాలి. వేసవిలో బత్తాయి పండ్లు మంచి మేలు చేస్తాయి. బత్తాయిలో మంచి పోషకాలే క

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (21:17 IST)
వేసవి కాలం వచ్చింది. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువుగా ఉంటుంది. దీని నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువ మోతాదులో పండ్లు, పండ్లరసాలు, మంచినీరు, మజ్జిగా ఎక్కువుగా తాగుతూ ఉండాలి. వేసవిలో బత్తాయి పండ్లు మంచి  మేలు చేస్తాయి. బత్తాయిలో మంచి పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏమిటంటే...
 
1. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
 
2. మలబద్దకంతో బాధపడేవాళ్లకి బత్తాయి రసంలో చిటికెడు ఉప్పువేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు, మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది.
 
3. డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్భుతమైన మందు.
 
4. బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, స్కర్వీ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్టు కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది.
 
5. ప్లూ, వైరస్‌లతో బాధపడే వాళ్లకి ఈ రసం బాగా పనిచేస్తుంది. వీటిలో సమృద్ధిగా ఉండే ప్లేవనాయిడ్లు అల్సర్‌ను తగ్గిస్తాయి.
 
6. గర్భిణీల్లో శిశువు పెరుగుదలకు బత్తాయిరసంలో పోషకాలు అన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్ధికి, వీర్యవృద్ధికీ కూడా తోడ్పడుతుంది. నరాల మీద ఒత్తిడినీ తగ్గిస్తుంది. 
 
7. బత్తాయిరసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకొని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధ పడేవాళ్లకి ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి దోహదపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments