Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు తమలపాకు తొడిమతో సహా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (15:11 IST)
తమలపాకులు దేవుని పూజకు ఎంతో ముఖ్యమైనవి. వీటిని తాంబూలంలాగా అన్ని దేవుళ్లకు సమర్పిస్తుంటారు. తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. తమలపాకులను అన్ని రకాల శుభకార్యాలకు  ఉపయోగిస్తారు. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే మేలు చేస్తాయి. 
 
2. తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యపు ఛాయలు కనిపించవు. నిల్వ చేసిన నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
3. తమలపాకులోని చెవికాల్ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.  
 
4. రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దచేసి నీళ్లతో తీసుకుంటే బోధకాలు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
5. అధిక బరువుతో సతమతమయ్యే వారు రెండు నెలల పాటు రోజూ ఒక తమలపాకు, పది గ్రాముల మిరియాలు కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 
6. తలనొప్పితో ఇబ్బంది పడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. 
 
7. తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. 
 
8. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

తర్వాతి కథనం
Show comments