Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు అధికంగా తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (17:54 IST)
నేటి తరుణంలో ఎక్కడ చూసినా హైబీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎలాంటి లాభాలు కనిపించవు. అంతేకాదు.. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. హైబీపీని తగ్గించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే...
 
1. ఎక్కువగా పచ్చళ్లు, నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోరాదు. వీటిని అధిక మోతాదులో తీసుకున్న వారికి బీపీ అధికమై గుండెపోటు వచ్చే ప్రమాదముందని ఇటివలే ఓ పరిశోధనలో తెలియజేశారు. 
 
2. నిత్యం ప్రతిరోజూ మీరు తయారుచేసుకునే వంటకాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలని వైద్యులు చెప్తున్నారు. 
 
3. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్స్, స్నాక్స్ వంటి పదార్థాలు తినడం మానేయాలి. ఈ పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుకు వీలైనంత వరకు ఇంట్లో చేసిన సహజసిద్ధమైన పదార్థాలు తినాలి. అప్పుడే ఎలాంటి అనార్యోలు రావు. 
 
4. ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలానే పండ్లు, కూరగాయలు, నట్స్, ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు వంటల్లో ఉపయోగించాలి. ఇలా చేస్తే హైబీపీ తగ్గుముఖం పడుతుంది. 
 
5. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నచో.. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇది హైబీపీకి దారితీస్తుంది. కనుకు కొవ్వు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం మానేయండి.. దీంతోపాటు రోజూ ఉదయాన్నే ఓ అరగంటపాటు వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

సీఎం చంద్రబాబు కృషి - ఏపీలో భారీ పెట్టుబడులు...

బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

Lulu Malls: తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో లులు మాల్స్ ఏర్పాటు

Teenage NRI: 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల.. ఏడు సెకన్లలోపు గుండె జబ్బుల్ని గుర్తించే..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

తర్వాతి కథనం
Show comments