Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే టెక్నిక్స్... ఇవిగోండి... రోజూ గంట పాటు సైక్లింగ్ చేస్తే..?!

మనిషి ఆకృతిలో బాగా ఇబ్బందిపెట్టేది పొట్ట భాగమే అని చాలామంది చెప్పే మాట. కాస్త లావయినా వెంటనే పొట్ట ముందుకు పొడుచుకు వస్తుంది. ఇక ఆ తర్వాత వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అందుకే బెల్లీ ఫ్యాన

Webdunia
సోమవారం, 16 మే 2016 (14:36 IST)
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం కారణంగా ఒబిసిటీ తప్పట్లేదు. ఒబిసిటీతో బాధపడేవారు.. పెరిగిన పొట్టతో తప్పకుండా ఇబ్బంది పడుతూనే ఉంటారు.

ఒబిసిటీ కారణంగా మనిషి ఆకృతిలో బాగా ఇబ్బందిపెట్టేది పొట్ట భాగమే. కాస్త లావైనా వెంటనే పొట్ట ముందుకు పొడుచుకు వస్తుంది. ఇక ఆ తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 

అందుకే పొట్టను నియంత్రించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్ట పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరుగుతాయని.. అందుకే ఒబిసిటీని నియంత్రించడంతో పాటు పొట్ట పెరగకుండా సరైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. 

అందుకే పొట్ట పెరగకుండా ఉండాలంటే.. ఏం చేయాలో చూద్దాం...!

ముందుగా ఉప్పు తగ్గించాలి:
మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పు. ఉప్పు ఎంత తగ్గుతుందో అంతగా పొట్ట పెరగకుండా ఉంటుంది. దానికి తోడు బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. 
 
రెండోది బాగా నిద్రపోవాలి : 
మీ పొట్టను కరిగించుకోవాలంటే నిద్ర తప్పనిసరి. రోజుకు 8 గంటలు తప్పక నిద్రపోవాలి. పొట్ట తగ్గాలనుకునేవారు పొట్ట తగ్గడం కోసం బోర్లా పడుకుని నిద్రించడం మంచిది. తద్వారా పొట్ట కండరాలు లోనికి చొచ్చుకోవడం ద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. 
 
ఇక తాజా కూరగాయలు తినాలి:
మీరు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్‌ తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. బ్రొకోలి, కాకరకాయ, క్యాబేజ్ జ్యూస్ వంటివి తీసుకోవడం ద్వారా  మీరు త్వరగా బరువు తగ్గడానికి పొట్టకరిగించుకోవడానికి సహాయపడుతాయి.
 
* ఫ్యాట్ ఫుడ్స్‌ను నివారించండి:
పొట్ట తగ్గాలంటే.. కచ్చితంగా ఫ్యాట్ ఫుడ్స్‌ను తినడం పూర్తిగా నివారించాలి. జంక్ ఫుడ్, ఫ్త్రెడ్ ఫుడ్, చిప్స్ వంటి వాటికి మీరు దూరంగా ఉండాల్సిందే. 
 
* పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి:
మీకు సమయం దొరికినప్పుడల్లా మీ బెల్లీ తగ్గడానికి, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. మీ నడుమును సైడ్ టు సైడ్ తిప్పుతుండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ వ్యాయామం.
 
* లోతుగా శ్వాస పీల్చండి:
మెడిటేషన్ భంగిమలో లోతుగా శ్వాస పీల్చడం వల్ల పొట్టను తగ్గించుకోవచ్చు. శ్వాస వ్యాయామాన్ని పాటించడం ద్వారా కూడా పొట్టను తగ్గించుకోవచ్చు. 
 
* పొటాషియంను పెంచండి:
మీ బెల్లీ తగ్గించుకోవాలంటే, మీరు తీసుకొనే పొటాషియం కంటెంట్‌ను పెంచాలి. శరీరంలో తక్కువ పొటాషియం ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటానికి కారణం అవుతుందని, నిపుణుల అభిప్రాయం.
 
* ఎక్కువ ద్రవాలు:
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే నీళ్ళు మీ బ్రెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు. రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే పొట్ట తగ్గుతుంది. 
 
* ఫైబర్ ఫ్రెండ్స్:
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, మీ రెగ్యులర్ డైట్‌లో ఫైబర్‌ను అధికంగా చేర్చుకోవాలి. ఓట్స్, రోటీ, బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలు మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.
 
* సైక్లింగ్ :
సైక్లింగ్ ద్వారా పొట్టను బాగా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఓ గంట పాటు సైక్లింగ్ చేయడం ద్వారా కేవలం 14 రోజుల్లోనే శరీరాకృతిలో మార్పును మీరు గమనించవచ్చును.
 
* వాటర్ ఫుడ్స్ :
నీరు అధికంగా ఉండే ఆహారాలు, వాటర్ మెలోన్ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
 
* నిదానంగా తినాలి:
మీరు తీసుకొనే ఆహారం చాలా నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు నిదానంగా తినడం మొదలు పెట్టి, అలవాటుగా మార్చుకుంటారో, పేగులకు జీర్ణించే శ్రమ తగ్గి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
* మనస్ఫూర్తిగా, బిగ్గరగా ఎక్కువగా నవ్వాలి :
మీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే, ఎక్కువగా మీరు బిగ్గరగా నవ్వడానికి ప్రయత్నించండి. నవ్వడం వల్ల మీ కడుపులోని కండరాలకు వ్యాయామంలా సహాయపడుతుంది. అందువల్ల మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించే అవకాశం ఉంది.
 
* నడక:
రోజూ అరగంట పాటు స్నేహితులతో లేదా మీ భాగస్వామితో కలిసి అలా వాకింగ్ చేయండి. సన్నిహితులతో కలిసి అలా వాకింగ్ చేయడం ద్వారా మనసుకు ఆహ్లాదం కలగడంతో పాటు శరీర కండరాలు ఫ్లెక్సీగా తయారవుతాయి. తద్వారా పొట్టలోని కొవ్వు కరగడం, కాళ్ళు నాజూగ్గా మారుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లగచర్ల దాడి కేసు : భారాస మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి అరెస్టు

కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఠాణా దాసోహం... మరో వీడియో లీక్

నెల్లూరులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం- 9 గొర్రెలు మృతి

ఈ-కార్ రేస్ స్కామ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్: సీఎం రేవంత్ రెడ్డి

"ప్రజా విజయోత్సవాలు" ఆ నలుగురికి ఆహ్వానం.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"కంగువ" ప్రీ బుకింగ్స్.. అమెరికాలో అదుర్స్.. మేకర్స్ హ్యాపీ

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

ఏడు నగరాల్లో ప్రమోషన్స్-పుష్ప 2 బాధ్యతలు బన్నీకే.. సుక్కూ బిజీ

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

తర్వాతి కథనం
Show comments