Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాన పొట్ట తగ్గాలా... అయితే ఇవి ఆరగించండి...

చాలా మంది బాన పొట్టతో బాధపడుతున్నారు. దీనికి కారణం... వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడం మాత్రమే కాదు.. కొన్ని

Webdunia
బుధవారం, 17 మే 2017 (11:38 IST)
చాలా మంది బాన పొట్టతో బాధపడుతున్నారు. దీనికి కారణం... వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడం మాత్రమే కాదు.. కొన్ని పదార్థాలను రోజూ తీసుకోవాలి. వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి.
 
బాన పొట్టతో ఉండే వారు... ప్రతి రోజూ ఉదయం పూట నూనెతో చేసిన అల్పాహారాలకు బదులు ఓట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవక్రియల రేటు వృద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనిలోని పీచు కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులు ఏవైనా తాజా పండ్ల ముక్కలూ, రసాలు కలిపితే సహజ చక్కెర్లు అందుతాయి. పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు.
 
మాంసకృత్తులు అధికంగా అందించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్లసొన తీసుకోవడం వల్ల బి12, డి విటమిన్లు, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అధికంగా అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్రపోషిస్తాయి. దీనివల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. గుండె పని తీరు కూడా మెరుగవుతుంది.
 
ఆకలిగా అనిపించినప్పుడు ఏ మిఠాయిలో, ఇతర చిరుతిళ్లొ తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వూ అందుతాయన్న బాధ ఉండదు. పోషకాలూ ఎక్కువగా అందుతాయి. బరువూ తగ్గుతారు. మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతోపాటు ఇతర నట్స్‌ తినాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments