Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ కోడిగుడ్లను కనిపెట్టడమెలా?

కల్తీ...కల్తీ ... కల్తీ..!! ఇప్పుడు ఏవి చూసినా... ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే కనిపిస్తున్నాయి. బియ్యం నుండి బంగారం వరకు... డబ్బు నుండి మనషుల వరకు.. ఇలా అన్నిట్లోనూ కల్తీ వస్తువులే తయారవుతున్నాయి. సాధ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (09:15 IST)
కల్తీ...కల్తీ ... కల్తీ..!! ఇప్పుడు ఏవి చూసినా... ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే కనిపిస్తున్నాయి. బియ్యం నుండి బంగారం వరకు... డబ్బు నుండి మనషుల వరకు.. ఇలా అన్నిట్లోనూ కల్తీ వస్తువులే తయారవుతున్నాయి. సాధారణంగా బియ్యం, పప్పులో రాళ్లు కలపడం ఇలా తిను పదార్థాలలో కేవలం కల్తీ మాత్రమే జరిగేది.. కానీ ఇప్పుడు ఏకంగా కల్తీకి బదులు నకిలీవే వచ్చేస్తున్నాయి. వీటితో ఆరోగ్యం పాడవడంతో పాటు.. వైద్యం కోసం డాక్టర్లకు పెట్టే ఖర్చు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు గుడ్లలో కూడా నకిలీ గుడ్లు వచ్చేసాయి. 
 
కొన్ని ప్ర‌త్యేక ప‌దార్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి త‌యారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువ‌గా చైనాలో త‌యార‌వుతున్నాయని నిపుణులు అంట‌ున్నారు. మ‌న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్ర‌యిస్తున్న‌ట్టు తాజాగా తెలిసింది. సాధార‌ణ కోడిగుడ్ల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుండ‌టంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్ల‌లో క‌లిపి అమ్ముతున్న‌ట్టు సమాచారం. కొన్ని కిటుకులు తెలుసుకుంటే న‌కిలీ, అస‌లు కోడిగుడ్ల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు… 
 
* అస‌లు కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది. కల్తీ కోడి గుడ్డు మెరుస్తుంది.
* న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న ఉండ‌దు. అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన వ‌స్తుంది. 
* అస‌లైన గుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డును పైన తాకితే గట్టిగా అనిపిస్తుంది. 
* నకిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి. 
* కోడిగుడ్డును కొనేటప్పుడు ఊపి చూడాలి. లోపల నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీగా గుర్తించాలి. ఎందుకంటే న‌కిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమిక‌ల్ ద్ర‌వాలు సుల‌భంగా క‌రిగిపోతాయి కాబ‌ట్టి. 
* గుడ్డును చిన్న‌గా ట‌క్‌ ట‌క్‌మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్‌మ‌ని బాగా వినిపిస్తుంది. 
* న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments