Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దుర్వాసన సమస్యకు ఇలా చేస్తే..? ఆ నాలుగు..?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (23:23 IST)
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మౌత్ వాష్‌లని, చూయింగ్ గమ్‌లని ఎక్కువగా తీసుకుంటుంటారు. అలా కాకుండా సహజ పద్ధతుల్లో నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు. నోటి దుర్వాసనకు ఉప్పు నీరు మేలు చేస్తుంది. ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటి శుభ్రం చేసుకుంటే చక్కని ఫలితం దక్కుతుంది. 
 
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. అదీ ఆహారం తీసుకున్న తర్వాత ఇలా చేయడం ద్వారా నోరు శుభ్రమవతుంది. ఇంకా దుర్వాసన వుండదు. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి. ఇందులో ఉండే మంచి లక్షణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
 
కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని ఈ పేస్ట్‌తో పళ్లను తోమితే నోటి దుర్వాసన వుండదు. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసనను తగ్గించుకోవచ్చు.
 
రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments